సిమ్లాలో దారుణం.. కదులుతున్న కారులో యువతిపై అత్యాచారం

  • నడుచుకుంటూ వెళ్తున్న యువతిని కారులోకి బలవంతంగా ఎక్కించుకున్న నిందితుడు 
  • ఆపై కారులో తిప్పుతూ అత్యాచారం
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతమైన సిమ్లాలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా బాధితురాలు సోమవారం హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సిమ్లాలోని మాల్‌రోడ్డులో బాధితురాలు నడుచుకుంటూ వస్తుండగా ఓ కారు వచ్చి ఆగింది. అనంతరం ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. తర్వాత కారులోనే ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Shimla
Himachal Pradesh
moving car
rape
Police

More Telugu News